- చిన్న పిల్లలకు చుక్కలు వేసిన మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్‌నగర్, ఆదివారం నాడు “నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే నినాదంతో జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. దేశవ్యాప్త పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె స్వయంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నపిల్లలకు పోలియో నివారణ చుక్కల మందు (డ్రాప్స్) వేశారు.
ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి: మేకల కావ్య అనంతరం మేకల కావ్య మాట్లాడుతూ… పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చిన్న పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
