Thursday, June 18, 2026
Homeవరంగల్‌Accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం.. నెల్లుట్ల సమీపంలో విషాదం

జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనం ప్రయాణిస్తుండగా టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. టైర్ మార్చేందుకు మరో వ్యక్తి సహాయంతో పనులు చేపడుతుండగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదంతో నెల్లుట్ల గ్రామ పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. రాత్రి, తెల్లవారుజామున వేళల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News