Homeకరీంనగర్Liquor Shops Closed | గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేత

Liquor Shops Closed | గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేత

గణేష్ నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లు, బెల్లర్లను నిర్దేశిత సమయంలో మూసివేయాలని(Liquor Shops Closed) జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో ఉన్న 71 మద్యం దుకాణాలు, 20 బార్లు, 304 బెల్లర్లను సెప్టెంబర్ 23 ఉదయం నుంచి సెప్టెంబర్ 25 ఉదయం వరకు మూసివేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

నిర్దేశిత కాలంలో ఎలాంటి మద్యం విక్రయాలు జరపకుండా సంబంధిత యజమానులు, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News