HomeజాతీయంCensus | దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు..

Census | దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు..

  • దాదాపు 16 ఏళ్ల తరువాత జరుగనున్న కార్యక్రమం..
  • షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం..

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు(Census) జరగబోతున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా జనాభా లెక్కల నిర్వహణకు తాజాగా కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ జన గణన నిర్వహించనున్నట్టు కేంద్ర పేర్కొంది. అయితే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు మాత్రం ఈ లెక్కల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర పేర్కొంది. పరిపాలనా పరమైన ఇబ్బందులు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం..

జనాభా గణన ప్రక్రియను మొత్తం రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఒకటి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, మరొకటి ప్రజజే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం. ఈ రెండు విధాల్లో జనగణను చేయనున్నారు. అయితే సెల్ఫ్‌ ఎమ్యూనరేషన్ విధానాన్ని జనవర్ 10 నుంచే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు అధికారులు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఇక జనాభా గణనకు 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను గడువును విధించింది ప్రభుత్వం. అంటే ఆ సమయానికి ఉన్న జనాభా వివరాలను ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు నమోదు చేయనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News