HomeజాతీయంPM Narendra Modi | జీతాలు పెంచండి..

PM Narendra Modi | జీతాలు పెంచండి..

  • కార్పొరేట్లకు ప్రధాని మోడీ సూచన..MP Narendra Modi
  • ప్రభుత్వం మీకు ఎన్నో రాయితీలు ఇచ్చింది..
  • వాటిని సద్వినియోగం చేసుకోండి..MP Narendra Modi

కార్పొరేట్ పన్నుల తగ్గింపు, పలు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పరిశ్రమలు ఎంతమందికి కొత్తగా ఉపాధి కల్పించాయి? ఉద్యోగుల వేతనాలను ఎంతమేర పెంచాయి? అంటూ భారత పారిశ్రామిక రంగాన్ని (PM Narendra Modi) ప్రధాని నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్నుల తగ్గింపు, నిబంధనల సరళీకరణ, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల వంటి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని గుర్తుచేశారు. ఆ ఫలాలను ఉద్యోగాల సృష్టి, మెరుగైన వేతనాల రూపంలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత పరిశ్రమలపైనే ఉందని స్పష్టం చేశారు.

దేశ సర్వతోముఖాభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, పారిశ్రామికవేత్తలు సైతం ఈ ప్రగతి ప్రయాణంలో సమాన భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంస్థలే సొంతంగా నిర్దిష్ట వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. ప్రతిదానికీ ప్రభుత్వంపైనే ఆధారపడవద్దని హితవు పలికారు. విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులకే అత్యున్నత నాణ్యతను కేటాయిస్తూ ‘ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ’ పేరిట ప్రచారం చేయడంపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ వినియోగదారులకు అందించే నాణ్యమైన వస్తువులనే భారతీయ పౌరులు కూడా పొందే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. దేశీయ మార్కెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News