- ఆరు నిమిషాలు కొనసాగిన పేలుడు..
- మూడు కి.మీ. ఎత్తువరకు బూడిద మేఘాలు..
ఫిలిప్పీన్స్ లో మయోన్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది.(Volcano Eruption) ఆరు నిమిషాలు కొనసాగిన పేలుడుతో భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. 3 కి.మీ ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి. గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయి.
ఫిలిప్పీన్స్లోని మయోన్ అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దాదాపు ఆరు నిమిషాల పాటు ఈ పేలుడు కొనసాగింది. ఈ ఘటనతో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. ఆ తర్వాత గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయి. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వత, భూకంప పరిశోధన సంస్థ ఐదు స్థాయిల హెచ్చరిక వ్యవస్థలో అలర్ట్ స్థాయిని 2 నుంచి 3కి పెంచింది. అగ్నిపర్వతం బిలం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
మయోన్ అగ్నిపర్వతంలో(Volcano Eruption) తొలి దశ శిలాద్రవ విస్ఫోటన ప్రక్రియ ప్రారంభమైందనీ రాబోయే రోజుల్లో లావా ప్రవహిస్తుందని అధికారులు హెచ్చరించారు. అగ్నిపర్వతం పైభాగం నుంచి కిందికి నదిలా సాగే వేడి వాయువులు, బూడిద, రాళ్లతో లావా ప్రవాహం క్షణాల్లో అడ్డొచ్చిన నిర్మాణాలను తుడిచిపెట్టేస్తుందని ప్రజలను అప్రమత్తం చేసారు. అగ్నిపర్వతానికి సమీపంగా విమానాలు ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 2,462 మీటర్ల ఎత్తులో ఉన్న మయోన్ అగ్నిపర్వతం రాజధాని మనీలాకు ఆగ్నేయంగా ఉంది. పర్ఫెక్ట్ కోన్ ఆకారంలో ఉండటం ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. 2023లో చుట్టుపక్కల నివసిస్తున్న 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
