చిన్న పొరపాటే ఎప్పుడైనా…. పెను ప్రమాదాన్ని తెస్తుంది ..! అర్థం లేకుండా నడుచుకుంటే అనర్థమే మిగులుతుంది!! ఏ పనిని మనం చేసినా…. ఎవరికి ఇబ్బంది రావొద్దు…! మనతో పాటు మరొకరికి సమస్య కావద్దు!! నిర్లక్ష్యమే నిలువునా.. ప్రాణాలను తీస్తుంది! కడకు కుటుంబాల్లో…. కన్నీటి శోకాన్ని తీసుకొస్తుంది…!! పెద్ద దిక్కు దూరమైతే… ఇల్లు ఆగమవుతుంది! కుటుంబమే అనాథగా.. బతుకు వెల్లబోస్తుంది…!! అపార నష్టానికీ.. అంతులేని దుఖాఃనికీ కారణం నిర్లక్ష్యమే! వెలుగుల బ్రతుకుల్లో చీకట్లకు మూలం అలక్ష్యమే!! అందుకే…..! నిర్లక్ష్యం వీడి… నిండు జీవితాన్ని సంతోషంగా గడుపుదాం…!!
- బీవీఆర్
