ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 35 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తారు.. అందులో కొందరు అవినీతిపరులు ఉండొచ్చు.. కానీ నిజాయితీపరులే ఎక్కువ.. అలాంటి ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక.. వారికి రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్, పెన్షన్లు మొదలైన వాటికోసం చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతారు.. వారి ఫైల్ కదలాలంటే అక్కడి అధికారులకు లంచాలివ్వాల్సిందే.. నాకొకటి అర్ధం కాదు.. రేపటి రోజున ఆ లంచాలు తీసుకున్న అధికారులు కూడా పదవీ విరమణ చెయ్యాల్సిందే కదా..? అప్పుడు కూడా వీళ్లకు అదే పరిస్థితి ఎదురైతే ఏమి చేస్తారు.. అరచి గగ్గోలు పెడతారు.. మరి మీరు చేసింది ఏమిటి..? ఒక సారి ఆలోచించండి.. మీలాగే పనిచేసిన ఉద్యోగుల పట్ల కాస్త మానవత్వంతో మెలగండి..
(రిటైర్డ్ ఉద్యోగి కథ చదివాక నా మనసు చాలా బాధ పడింది.. ఆ బాధలోంచి పుట్టినవే ఈ అక్షరాలు..)
- బీవీఆర్ రావు
