Thursday, May 28, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఖజానా నిండుతోంది.. కుటుంబాలు కూలిపోతున్నాయి

Aaj Ki Baath | ఖజానా నిండుతోంది.. కుటుంబాలు కూలిపోతున్నాయి

మన రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నది మద్యం ఆదాయమే!. అందుకే నాటి – నేటి పాలకులకు ఈ రాబడిపై మక్కువ ఎక్కువైందా! కానీ మరోవైపు ప్రజల ఆరోగ్యం ప్రాణ సంకటంగా మారడంతో వారి కుటుంబాల్లో నిత్యం కన్నీటి గాధలే?. మద్యం వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా కుంగిపోతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే ఈ ఆదాయానికే ప్రాధాన్యం ఇచ్చే అమానవీయ విధానంతో రాష్ట్రం క్రమంగా రోగగ్రస్త సమాజంగా మారుతోంది. ఈ సామాజిక విపత్తును కట్టడి చేయాల్సిన బాధ్యత పాలకులపై లేదా! పాలనలో చిత్తశుద్ధి ఉంటే? ప్రజలకు ఇచ్చే ఓటు బ్యాంకు ఉచిత పథకాలను తగ్గించి, ఉపాధి – ఉద్యోగ అవకాశాలతో పాటు ఆరోగ్యవంతమైన ఆదాయ పునరుత్పాదక అభివృద్ధి మార్గాల ద్వారా రాష్ట్ర ఖజానాను పెంచు కోవాలి. ప్రజల జీవితాలను చీకటిలోకి నెట్టే మద్యం ఆదాయంపైనే ఆధార పడడమే శోచనీయం!

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News