Homeహైదరాబాద్‌Imliban Gawshala | గోమాత సేవయే పరమాత్మ సేవ

Imliban Gawshala | గోమాత సేవయే పరమాత్మ సేవ

భాగ్యనగర ఆధ్యాత్మిక హృదయం “ఇమ్లీ బాన్ గోశాల”

కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరారణ్యంలో, మూసీ నది తీరాన ఆధ్యాత్మికతను, జీవకారుణ్యాన్ని చాటిచెబుతున్న అరుదైన క్షేత్రం ఇమ్లీ బాన్‌ గోశాల (శ్రీ సమర్థ కామధేను గోశాల). ‘‘గావో విశ్వస్య మాతరః’’ – అంటే ఆవు విశ్వానికే తల్లి అన్న వేద వాక్కును ఈ గోశాల అక్షరాలా నిజం చేస్తోంది. ఒక అద్భుత నిర్మాణం నగరంలో స్థల భావం ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో గోమాతలకు ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో ఇక్కడ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

మనుషులు నివసించే అపార్ట్‌మెంట్‌ తరహాలోనే, ఆవుల కోసం నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులోనూ గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా, గోవులు స్వేచ్ఛగా తిరిగేలా శాస్త్రీయంగా దీనిని రూపొందించారు. 2009లో ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదురైనా, గోరక్షకుల మొక్కవోని ధైర్యం, భక్తుల సహకారంతో ఈ అద్భుత నిర్మాణం సాధ్యమైంది.

Spiritual Cow Service at Imliban Gawshala Hyderabad0

ఆర్తత్రాణ పరాయణి.. ఈ గోశాల!

ప్రస్తుతం ఇక్కడ సుమారు 3,000 పైగా గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. ఇందులో కేవలం పాలిచ్చే ఆవులే కాదు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాలు. అక్రమ రవాణా కబేళాల నుండి రక్షించబడిన గోమాతలు. వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల రోడ్డున పడ్డ గోవులు. వీటన్నింటినీ తమ కన్నబిడ్డల్లా చూసుకుంటూ, ప్రత్యేక వైద్య బృందంతో శస్త్రచికిత్సలు మరియు చికిత్సలు అందించడం ఇక్కడి ప్రత్యేకత.

Spiritual Cow Service at Imliban Gawshala Hyderabad01

హిందూ ధర్మంలో గో ప్రాముఖ్యత – ముక్కోటి దేవతల నిలయం

మన సనాతన ధర్మంలో గోవును కేవలం జంతువుగా చూడము. గోవు శరీరంలోని ప్రతి అణువులోనూ ఒక దేవత కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోవును దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది.
గ్రహ దోష నివారణ: శని దోషం లేదా ఇతర గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు గో సేవ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. గోవును నిమరడం వల్ల మనిషిలో ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆధునిక విజ్ఞానం కూడా ధృవీకరిస్తోంది.

మన బాధ్యత – గో సేవలో భాగస్వామ్యం

ప్రతిరోజూ వేలాది గోవులకు వందలాది టన్నుల పచ్చిగడ్డి, దాణా మరియు పోషకాహారం అవసరమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ‘‘గో యజ్ఞం’’ కేవలం భక్తుల సహకారంతోనే సాధ్యం. మీ ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా పెద్దల జ్ఞాపకార్థం ఇమ్లీ బాన్‌ గోశాలను సందర్శించండి. ఆ గోమాతల కళ్లలో కనిపించే కృతజ్ఞత మీకు ఇచ్చే తృప్తి అద్వితీయం.మీ చేతుల మీదుగా గడ్డిని, దాణాను సమర్పించండి. గోవుల మేత కోసం, వైద్య ఖర్చుల కోసం మీ శక్తి మేరకు విరాళాలను అందించండి. వీలున్నప్పుడు గోశాల నిర్వహణలో పాలుపంచుకోండి. మీరు అందించే చిన్న సహాయం ఒక గోమాత ఆకలిని తీరుస్తుంది.. మీ జీవితంలో పుణ్య ఫలాన్ని నింపుతుంది. రండి! గో సంరక్షణలో భాగస్వాములవుదాం.. భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News