- మహారాష్ట్రలో హరి ఓం పవర్ అండ్ ఎనర్జీ నుంచి 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఆర్డర్‌ను దక్కించుకున్న ట్రూజోన్ సోలార్..
- పీఎం – కుసుమ్ కాంపోనెంట్-సి కింద రూ.236 కోట్ల విలువైన ఆర్డర్..
- ఇప్పటికే 15 మెగావాట్ల పనులు పూర్తి..
- నాణ్యత ముందస్తు సేవలకు ప్రాధాన్యమిస్తూ ఆరేళ్ల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న సంస్థలు..
గతంలో సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ప్రసిద్ధి చెందిన ట్రూజోన్ క్లీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్,(TruZon Solar) మహారాష్ట్రలో మొత్తం 72 మెగావాట్ల సామర్థ్యంతో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి హరి ఓం పవర్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.236 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఈ ఆర్డర్‌కు సంబంధించిన వివరాలను స్టాక్ మార్కెట్లో లిస్టయిన హరి ఓం సంస్థ ఇప్పటికే సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా వెల్లడించింది. మొత్తం 72 మెగావాట్ల ప్రాజెక్టులో ఇప్పటికే 15 మెగావాట్ల పనులను ట్రూజోన్ పూర్తి చేసింది.
మహారాష్ట్రలోని హింగోలి, లాతూర్, పర్భణి, బీడ్ జిల్లాల్లో పీఎం – కుసుమ్ పథకం కాంపోనెంట్-సి కింద ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారీ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టుల విభాగంలో ట్రూజోన్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల సేకరణ, నిర్మాణం, ఇన్స్టాలేషన్, పరీక్షలు, కమిషనింగ్, పనితీరు ప్రదర్శన వంటి అన్ని దశలను ట్రూజోన్ టర్న్‌కీ విధానంలో చేపడుతోంది. ప్రాజెక్టులు పూర్తయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన అనంతరం, తుది ప్రాజెక్టు సాంకేతిక వివరాలు, నిర్వహణ పరిస్థితులకు అనుగుణంగా ఏటా సుమారు 89.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఆర్డర్‌పై ట్రూజోన్ సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేష్ గుప్త మాట్లాడుతూ, “72 మెగావాట్ల ఈ ఆర్డర్ మా సంస్థ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మా సంస్థపై వినియోగదారులు ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. ట్రూజోన్ సోలార్‌ను మరోసారి ఎంపిక చేసుకున్న రూపేష్ గుప్తాకి, హరి ఓం పవర్ అండ్ ఎనర్జీ సంస్థకు మా కృతజ్ఞతలు. మేము చేపట్టే ప్రతి ప్రాజెక్టు విషయంలో మా బాధ్యత కమిషనింగ్తోనే ముగిసిపోదు.
ప్రతి ప్లాంట్ నిరంతరం సమర్థవంతంగా పనిచేసేలా చూడటం కూడా మా నిబద్ధతలో భాగమే. ఇప్పటికే 15 మెగావాట్ల పనులను పూర్తి చేశాం. మా ఇంజినీరింగ్ నైపుణ్యం, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ముందస్తు సేవలతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ మహారాష్ట్రలో వ్యవసాయ రంగ సౌరీకరణకు తోడ్పడుతున్నాం” అని తెలిపారు.
ట్రూజోన్ సోలార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ జక్కుల మాట్లాడుతూ, “నాలుగు జిల్లాల్లో 72 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అమలు చేయాలంటే కచ్చితమైన ఇంజినీరింగ్ ప్రణాళికతో పాటు వివిధ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరం. పరికరాల సేకరణ, ప్రాజెక్టు ప్రాంతాల్లో అవసరమైన వనరుల సమీకరణ, నిర్మాణ పనులు, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ వంటి అన్ని దశలను సమగ్ర ప్రణాళికతో అమలు చేయడంపై మా బృందాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. భద్రత, దీర్ఘకాలిక పనితీరుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా విశ్వసనీయమైన సౌర విద్యుత్ మౌలిక సదుపాయాలను అందించడమే మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.

హరి ఓం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రూపేష్ గుప్తా మాట్లాడుతూ, “”ఆరేళ్ల క్రితం ట్రూజోన్ మా కోసం 2 మెగావాట్స్, 1.5 మెగావాట్స్, ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఆ అద్భుతమైన అనుభవం ఆధారంగానే ఈ ఆర్డర్‌తో ముందుకు వెళ్లాము. గత ఆరేళ్లుగా ట్రూజోన్ సోలార్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతోంది. 72 మెగావాట్ల ఈ ప్రాజెక్టును ట్రూజోన్కు అప్పగించాలనే మా నిర్ణయానికి ప్రధాన కారణం వారు నిరంతరం పాటిస్తున్న అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, అద్భుతమైన అమ్మకాల అనంతర సేవలు, సమస్యలు తలెత్తకముందే స్పందించే విధానం.
మేము సంప్రదించకముందే వారి బృందం సేవల అవసరాలను గుర్తించి మమ్మల్ని సంప్రదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ప్రాజెక్టులు దీర్ఘకాలంలో సమర్థవంతంగా పనిచేస్తాయనే నమ్మకాన్ని ఈ విధానం కల్పిస్తోంది. అనుభవం, జవాబుదారీతనం, పరస్పర విశ్వాసంపై నిర్మితమైన మా భాగస్వామ్యాన్ని ఈ ఆర్డర్ మరింత బలోపేతం చేస్తుంది” అని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ట్రూజోన్ సంస్థకు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నాయి. సౌర విద్…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
