- అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై గ్రామస్థుల ఆగ్రహం
- సిలిండర్ల నుంచి ఖాళీ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ నింపుతున్న వైనం
- డెలివరీ బృందం తీరుపై గ్రామస్థుల మండిపాటు
- పోలీసులకు ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
చింతకుంట గ్రామ శివారులో గ్యాస్ సిలిండర్ల అక్రమ రీఫిల్లింగ్(Illegal Gas Refilling) వ్యవహారం కలకలం రేపింది. భారత్ గ్యాస్‌కు(Bharat Gas) చెందిన నిండు సిలిండర్ల నుంచి ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్‌ను అక్రమంగా నింపుతున్న డెలివరీ బృందాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరునేలోపు డెలివరీ బాయ్స్ పరారయ్యారు.
దీంతో గ్రామ సర్పంచ్ నాగం భూమయ్య వెంటనే స్పందించి, స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(epaper.aadabhyderabad.in)
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రమాదకరమని, ఇలాంటి వ్యవహారాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
