- “భారత ఎన్నికల కమిషన్” ను భారతీయ జనతా పార్టీ గా మార్చారు.
వనపర్తి: “సర్” పేరుతో ఓట్ల తొలగింపు తగదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి(Wanaparthy MLA Tudi Megha Reddy) అన్నారు. ఇండియా కూటమి చేపట్టిన ఓటు హక్కు పరిరక్షణలో భాగంగా శనివారం వామపక్ష నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వారికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనీ డిమాండ్ చేశారు.
“సర్” ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ ప్రక్రియను ఉపయోగించి తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని ఎమ్మెల్యే హితవు పలికారు. గతంలో రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ లో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలు నిర్ణయాలు ఉండేవని .. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ “భారత ఎన్నికల కమిషన్” ను భారతీయ జనతా పార్టీ గా మార్చారని విమర్శించారు.

సర్ ప్రక్రియ పేరుతో ఓట్ల ను తొలగించి రాజకీయ లబ్ధి పొందిస్తున్నారని స్పష్టం చేశారు.అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ప్రతి ఓటరుకు తన ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని కోరారు. సిపిఐ, సిపిఐ ఎంఎల్, సిపిఎం, ఎంఐఎం, టీజేఎస్ నాయకులు మాట్లాడితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
