- అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?Illegal constructions on HMDA lands
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం ప్రాంతంలో (Illegal constructions on HMDA lands). సర్వేనెంబర్.. 706/758/757/756/755/ గల. హెచ్‌ఎండీఏకు చెందిన ప్రభుత్వ భూముల్లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు సమాచారం అందుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మల్కారం ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని, భూముల హద్దులను నిర్ధారించి అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తేలితే వాటిని తక్షణమే తొలగించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ వ్యవహారంపై అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
