- మార్మోగుతున్న జాన్ ఓసాఫ్ పేరు..Jon Ossoff Democratic Party
- బరాక్ ఒబామాతో పోలుస్తున్న జనాలు..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ (Jon Ossoff Democratic Party) పార్టీకి కీలక విజయాలు దక్కిన వేళ.. ఆ పార్టీ యువ నాయకుడు జాన్ ఒసాఫ్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. జార్జియా రాష్ట్రం నుంచి సెనేట్‌కు మరోసారి ఎన్నికైన ఆయన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగవచ్చనే చర్చ మొదలైంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలికలు రావడం ఈ ఆసక్తిని మరింత పెంచుతోంది.
39 ఏళ్ల ఒసాఫ్ 2021లో తొలిసారి జార్జియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 ఏళ్లు మాత్రమే. స్వల్ప ఆధిక్యంతో గెలవడంతో రాజకీయ విశ్లేషకులు ఆయనను ‘అనుకోకుండా సెనేటర్ అయిన వ్యక్తి’గా అభివర్ణించారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే రాష్ట్రంలో తిరిగి విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు లభించిన జార్జియాలో ఒసాఫ్ గెలవడం విశేషం. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ కాలిన్స్‌ను ఓడించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాలనపై ఒసాఫ్ తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్షుడు, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అట్లాంటాలో జరిగిన సభలోనూ ట్రంప్ పాలనపై ఘాటుగా స్పందించారు. అమెరికా ప్రజలు అవినీతి, అసమర్థతను తిరస్కరించారని వ్యాఖ్యానించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
