Friday, April 17, 2026
Homeక్రైమ్ వార్తలుIbrahimpatnam | అక్రమ ఆవుల రవాణా..

Ibrahimpatnam | అక్రమ ఆవుల రవాణా..

  • డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న స్థానికులు..
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
  • కేసు విచారణ చేస్తున్నట్లు వెల్లడి..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ఘటన బయటపడింది. మంచాల మండలంలోని ఆగాపల్లి వద్ద స్థానికులు అప్రమత్తమై వ్యహరించి సుమారు 15 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. ఆవుల కాళ్లు కట్టిపడేసి, గుట్టుచప్పుడు కాకుండా వాటిని తరలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పశువుల అక్రమ రవాణాపై వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News