Homeక్రైమ్ వార్తలుFraud | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో దగా..

Fraud | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో దగా..

  • నకిలీ ఉత్తర్వులు సృష్టించి మోసాలు..
  • ముఠా సభ్యుడి అరెస్ట్..
  • 52 నకిలీ పత్రాలు స్వాధీనం..

హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, మొఘల్‌పురా పోలీసులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌లో ప్రభుత్వ “2 బీ.హెచ్.కె. డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్” కింద ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి నకిలీ కేటాయింపు పత్రాలతో అమాయకులను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితుడి వివరాలు :
సయ్యద్ సల్మాన్ (తండ్రి: సయ్యద్ షరీఫ్),వయస్సు: 27 సంవత్సరాలు,వృత్తి: క్యాబ్ డ్రైవర్, చిరునామా : సలామా, బార్కస్, చాంద్రాయణ గుట్ట, హైదరాబాద్.

- Advertisement -

స్వాధీనం చేసుకున్న వస్తువులు : నకిలీ, ఫోర్జరీ పత్రాలు – 52.. మొబైల్ ఫోన్ – 01..

కేసు వివరాలు, నేర విధానం :
సయ్యద్ సల్మాన్ చాంద్రాయణగుట్టలోని బార్కస్ నివాసి. పదో తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపివేశాడు. అనంతరం కొన్ని నెలలు మీసేవ కేంద్రంలో పనిచేసి, ఆ తర్వాత కిషన్‌బాగ్‌లోని అబ్రామ్ మోడల్ స్కూల్‌లో హెల్పర్‌గా చేరాడు. అక్కడ స్కూల్ ఇన్‌ఛార్జ్ ఆస్మా సుల్తానాతో పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపజేస్తానని ఆస్మా సుల్తానాను నమ్మించాడు.

ఆమెను నమ్మించి, వివిధ విడతల్లో రూ. 1,50,000 వసూలు చేశాడు. ప్రాసెసింగ్ కోసం అవసరమని చెప్పి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను సేకరించాడు. అనంతరం ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ 2 బీ.హెచ్.కె. అల్లాట్‌మెంట్ ఆర్డర్ కాపీలను సృష్టించి బాధితులకు అందజేశాడు. ఇదే రీతిలో 50 మందికి పైగా అమాయకులను మోసం చేసి, రూ. లక్షల మొత్తాన్ని వసూలు చేసి తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ జాహిద్, హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, మొఘల్‌పురా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News