Homeహైదరాబాద్‌HYDRAA | కుంట్లూర్ లో కబ్జాకు గురైన పార్కు... స్వాధీనం చేసుకున్న హైడ్రా

HYDRAA | కుంట్లూర్ లో కబ్జాకు గురైన పార్కు… స్వాధీనం చేసుకున్న హైడ్రా

పెద్ద అంబర్పేట్: పెద్ద అంబర్పేట్ పరిధిలోని కుంట్లూర్ 51 వ డివిజన్ , మంజీర కాలనీ ఫేస్ 1 సర్వేనెంబర్ 82 లో గల 577 గజాల పార్కు స్థలాన్ని కొందరు దళారులు 82 బి సర్వే నెంబర్ లే అవుట్ లోని ఇంటి స్థలాలుగా చూపించి మూడు ప్లాట్లుగా చేసి అమ్మడం జరిగినది . కబ్జాకు గురి అయిన పార్కు స్థలాన్ని గుర్తించిన కాలనీవాసులు హైడ్రాకు(HYDRAA) ఫిర్యాదు చేయగా , ఆ స్థలాన్ని పూర్తిగా కంచెను ఏర్పాటు చేసి హైడ్రా స్వాధీనం(HYDRAA Reclaims) చేసుకోవడం జరిగినది, కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా త్వరితగదన స్పందించడంలో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

త్వరలో దీనిని పూర్తిస్థాయిలో కాలనీ పార్కుగా గుర్తించి కాలనీ ప్రజలకు వ్యాయామం, వాకింగ్ , ఓపెన్ జిమ్ కు ఉపయోగపడేలా అలాగే సీనియర్ సిటిజన్స్ విశ్రాంతి తీసుకునేలా బెంచీలు ఏర్పాటు చేయించాలని ఆహ్లాదకరంగా ఉండే విధంగా మొక్కలు పెంచాలని దీనికి కాలనీ కమిటీ పూర్తిగా సహకరిస్తుందని దానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ తగు చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

ఈ పరిణామం లో కాలనీకి సహకారం అందించిన పెద్ద అంబర్పేట్ మాజీ కౌన్సిలర్ , జిఎస్ సేవాసమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్, షేక్ లాల్ మహమ్మద్, చిన్న జహంగీర్ లకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News