Homeరంగారెడ్డిGHMC | హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులకు శ్రీకారం..

GHMC | హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులకు శ్రీకారం..

  • జీహెచ్‌ఎంసీ అధికారుల స్పందనపై
  • బి ఆర్ ఎస్ నాయకుడు భాస్కర్ యాదవ్ హర్షం

మేడ్చల్ సర్కిల్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి మరమ్మతు పనులు ప్రారంభించడం హర్షణీయమని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, మూసుకుపోయిన డ్రైనేజీల కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం నిర్వహించిందని తెలిపారు.

ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆయన కోరారు. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న డిప్యూటీ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు భాస్కర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఇదే విధమైన చొరవ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News