Homeహైదరాబాద్‌BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం ప్రార్థన

BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం ప్రార్థన

42 శాతం బీసీ రిజర్వేషన్లు సాకారం కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government), తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ (Telangana BC Commission) ఆధ్వర్యంలో శనివారం ప్రార్థన(Prayer), పూజ్య బాపూజీ స్మృతి భజన (Pujya Bapuji’s Memorial Bhajan) జరిగింది. హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని బాపు ఘాట్ (Bapu Ghat) వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు(Tpcc President), ఎమ్మెల్సీ (Mlc) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మాజీ ఎంపీ హనుమంతరావు(VH), బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

- Advertisement -

బాపు ఘాట్ దగ్గర తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఆలోచన విధానం మేరకు శాంతియుతంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా అందరి మనసులు మారాలని ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చట్ట పరంగా ,న్యాయ పరంగా చేయాల్సినవి చేసి గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఏ విధంగా ఉద్యమం చేశారో ఇప్పుడు కూడా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి సకల జనులు ఇటీవల ఐక్యంగా బంద్ నిర్వహించి కార్యాచరణ తీసుకోవడం జరిగింది

WhatsApp Image 2025 11 01 at 13.00.45

శివుని పటంలో పాము , నంది , నెమలి ,ఎలుక వీటన్నిటికి ఒకదానికి ఒకటి పడవు..కానీ శివుడి దగ్గర కలిసి ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి అందరూ ముందుకు రావాలి. అన్ని రాజకీయ పార్టీలుగా వ్యక్తులుగా ,ప్రజా ప్రతినిధులు గా ,రాజకీయ నాయకులుగా వేరు..ఈ కార్యాచరణ సాధించడానికి అందరూ ఐక్యంగా అన్ని వర్గాలు మనం రిజర్వేషన్లు సాధించుకోవాలి. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో 42 శాతం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం

మేము చిత్తశుద్ధి తో చేయాల్సినవి చేశాం.. ఇంకా ఏమైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి అందరం అక్కడికి వచ్చి సాధించుకుందాం. తెలంగాణ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి

- Advertisement -
RELATED ARTICLES

Latest News