Wednesday, May 13, 2026
Homeరంగారెడ్డిCelebrations | మేడ్చల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు….

Celebrations | మేడ్చల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు….

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న రామన్నగారి రాఘవేందర్ గౌడ్

మేడ్చల్ పట్నంలోని కిందిబస్తిలో ఉన్న దుర్గమ్మ గుడి వద్ద హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతెంక సాయి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానిక భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నగారి రాఘవేందర్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో రఘు, నాని, సాయి, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News