Homeబిజినెస్Gold | స్వల్పనగా తగ్గిన బంగారం ధర..

Gold | స్వల్పనగా తగ్గిన బంగారం ధర..

  • అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకులు..
  • వెండి ధరలు కూడా తగ్గుముఖం..

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్‌ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 10 గ్రాముల స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం రూ.1,56,210ల వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,190ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,160గా ఉంది.

మంగళవారం నాటి ముగింపు ధరలతో పోలిస్తే.. సుమారు పది రూపాయల మేర తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అమరావతిలో రూ.1,56,210లు, విజయవాడలో రూ.1,56,210లు, విశాఖపట్నంలో రూ.1,56,210, రాజమండ్రిలో రూ.1,56,210 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కదలికలు, అమెరికా డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

- Advertisement -

అంతర్జాతీయంగా కమొడిటీ మార్కెట్లపై ఒత్తిడి తగ్గడంతో ధరలు కాస్త మెత్తబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ ఏమీ లేకపోవడంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నగరంలోని జ్యుయెలరీ వ్యాపారులు తెలిపారు. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్థిరంగా ఉంటూ స్వల్పంగా తగ్గాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News