Homeఆదాబ్ ప్రత్యేకంIllegal Construction | ప్లాన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..!

Illegal Construction | ప్లాన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..!

సర్కిల్-32 పరిధిలో ‘సెల్లార్ ప్లస్ 7’ అక్రమ భవనంపై జీహెచఎంసీ షోకాజ్ నోటీసు..

  • రూ. 14 లక్షల ముడుపుల వసూళ్లపై తీవ్ర నిరసనలు..
  • అధికారుల సహకారంతోనే రెండేళ్లుగా సాగిన దందా..?
  • అక్రమ భవనాన్ని కూల్చివేయాలి..
  • అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల దందా యథేచ్ఛగా సాగుతోంది. గోల్కొండ జోన్, సర్కిల్ నెం.32 పరిధిలోని షేక్‌పేట్ తేజ కాలనీలో కేవలం రెండు అంతస్తుల నివాస భవనానికి అనుమతులు తీసుకుని, ఏకంగా సెల్లార్‌తో పాటు ఏడు అంతస్తుల భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్న తీరుపై 13 జూలై 2026 న ప్రచురితమైన కథనానికి జీహెచఎంసీ అధికారులు స్పందించారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భవన యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

గోల్కొండ జోన్, సర్కిల్ నెం.32 టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నోటీసునెం.36/ఏసీపీ/టీపీఎస్/సీ32/జీజెడ్/జీహెచఎంసీ/ 2026 ద్వారా షేక్‌పేట్‌లోని ప్లాట్ నెం.36 (ప్రాంగణం నెం. 8-1-423/36 తూర్పు, పడమర భాగాల్లో ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు నిర్మిస్తున్నట్లు నిర్ధారించారు. మహమ్మద్ అబ్దుల్ నసీర్, తహెరా సుల్తానా పేరుతో సాగుతున్న ఈ నిర్మాణం జీహెచఎంసీ చట్టం – 1955, టీఎస్-బీపాస్ చట్టం – 2020 సెక్షన్ – 10కు విరుద్ధమని స్పష్టం చేశారు. తక్షణమే పనులను నిలిపివేసి, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆగస్టు 2న డిప్యూటీ కమిషనర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోతే భవనాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.

GHMC Issues Notice Over Shaikpet Illegal Building 1.jpg1 1

ప్రతి అంతస్తుకూ రూ.2 లక్షల ముడుపులు? : నోటీసులు ఇవ్వడం వరకు బాగానే ఉన్నా, ఈ అక్రమ నిర్మాణం ఈ స్థాయికి చేరుకోవడానికి టౌన్ ప్లానింగ్ అధికారుల లోపయకారీ ఒప్పందమే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రెండు అంతస్తుల అనుమతితో ఏడు అంతస్తుల భారీ భవనం నిర్మించడానికి సుమారు రెండేళ్ల సమయం పడుతుందని, ఇన్నాళ్లూ అధికా రులు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ వసూళ్లు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమ తులకు విరుద్ధంగా నిర్మించిన ప్రతి అంతస్తుకు టౌన్ ప్లానింగ్ అధికారులు రూ.2 లక్షల చొప్పున, మొత్తం 7 అంతస్తులకు గాను సుమారు రూ.14 లక్షలు ముడుపుల రూపంలో వసూలు చేశారనే బహిరంగ విమర్శలు వస్తున్నాయి. వార్తలు వచ్చి ఒత్తిడి పెరిగిన తర్వాతే మమ అనిపించేలా కంటితుడుపు నోటీసులు జారీ చేశారనే భావన వ్యక్తమవుతోంది.

కమిషనర్ చర్యలు తీసుకునేనా? : ఇప్పటికైనా జీహెచఎమ్‌సీ కమిషనర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన సదరు భవనాన్ని తక్షణమే నేలమట్టం చేయాలని స్థానిక నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధం గా, గత రెండేళ్లుగా ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ మామూ ళ్లకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులపై వెంటనే శాఖాపరమైన తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News