Homeఆదాబ్ ప్రత్యేకంMiddle Class Family | అలసిపోతున్న మధ్యతరగతి కుటుంబం..

Middle Class Family | అలసిపోతున్న మధ్యతరగతి కుటుంబం..

  • జీతం వస్తోంది.. జీవితం మాత్రం గడవడం లేదు..!
  • అప్పులు.. ఈఎంఐలు.. ఫీజులు.. ధరల మంటల మధ్య మధ్యతరగతి కుటుంబం..
  • కలల కోసం కష్టపడుతూ.. ఖర్చుల కింద నలిగిపోతున్న కుటుంబ వ్యవస్థ..
  • మధ్యతరగతి కుటుంబ వ్యవస్థపై ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రత్యేక కథనం..

ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం(Middle Class Family) అంటే పొదుపు.. సర్దుబాటు.. కుటుంబ విలువలు భవిష్యత్తుపై భరోసా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారు తున్నాయి. సంపాదన పెరిగే వేగం కంటే ఖర్చులు పెరుగు తున్న వేగమే ఎక్కువగా కనిపిస్తోంది. నెలజీతం చేతికి రాకముందే దాని కి వెళ్లే దారులు సిద్ధంగా ఉంటున్నాయి. అద్దె, కరెంట్ బిల్లు, పిల్ల ల ఫీజులు,నిత్యావసరాలు,ప్రయాణ ఖర్చులు,వైద్యం, రుణ వాయి దాలు.. ఇలా జీతం మొత్తం ముందుగానే విభజించబడుతోంది.

నెల మొదట్లో జీతం.. నెలాఖరులో అప్పు : మధ్యతరగతి కుటుంబానికి(Middle Class Family) నెల మొదటి వారం కొంత ఊరటగా ఉన్నా.. చివరి వారం వచ్చేసరికి లెక్కలు మొదలవుతున్నాయి. ఏ ఖర్చు తగ్గించాలి? ఏ బిల్లు వాయిదా వేయాలి? ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి? అనే ఆలోచనలే మిగులుతున్నాయి.అనుకోని వైద్య ఖర్చు లేదా కుటుంబ అవసరం ఎదురైతే పొదుపు సరిపోక అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

పిల్లల భవిష్యత్తు కోసం.. తల్లిదండ్రుల వర్తమానం త్యాగం : పిల్లలకు మంచి చదువు అందించాలన్నది ప్రతి తల్లిదండ్రి కల. పాఠశాల ఫీజుల నుంచి ఉన్నత విద్య, కోచింగ్ వరకు పెరుగుతున్న ఖర్చులు కుటుంబ బడ్జెట్‌పై భారంగా మారుతున్నాయి. పిల్లల కలలు నెరవేరాలని తల్లిదండ్రులు తమ చిన్న చిన్న కోరికలను వాయిదా వేస్తున్నారు. కొత్త బట్టలు, విహా రయాత్రలు, వ్యక్తిగత అవసరాలు.. అన్నీ పిల్లల భవి ష్యత్తు ముందు రెండో స్థానంలోకి వెళ్లిపోతున్నాయి.

సొంతింటి కల.. ఈఎంఐల బంధం : సొంత ఇల్లు మధ్యతరగతి కుటుంబానికి జీవితకాల కల. కానీ ఆ కలను నిజం చేసుకు నేందుకు తీసుకున్న గృహరుణం నెలల్ని కాదు.. దశాబ్దాల పాటు వెంటాడుతోంది.. ఇల్లు సొంతమవు తుంది.. కానీ జీతంలో పెద్ద భాగం బ్యాంకుదే!

ఆరోగ్య సమస్య వస్తే.. ఆర్థిక భద్రతకు పరీక్ష : ఒక కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద వైద్య ఖర్చు వస్తే మొత్తం ఆర్థిక ప్రణాళిక తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. పొదుపు మొత్తం ఖర్చయిపోవడం, అప్పులు చేయడం, ఇతర అవసరాలను వాయిదా వేయడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సోషల్ మీడియాలో సంతోషం.. నిజ జీవితంలో లెక్కలు : బయటికి చూస్తే ప్రతి కుటుంబం సంతోషంగానే కనిపిస్తుంది. ఫొటోలు, వేడుకలు, కొత్త వస్తువులు, ప్రయాణాలు.. అన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ప్రతి ఇంటి వెనుక ఒక ఆర్థిక లెక్క ఉంటుంది.బయటికి కనిపించేది నవ్వు.. కనిపించనిది ఒత్తిడి.

కుటుంబ వ్యవస్థపై పెరుగుతున్న ప్రభావం : ఆర్థిక ఒత్తిడి కేవలం జేబుపైనే కాదు.. కుటుంబ సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాలపై చర్చలు, పిల్లల అవసరాలు, భవిష్యత్తుపై ఆందోళనలు.. ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయి.అయినా మధ్యతరగతి కుటుంబం ఆగడం లేదు.రేపటి కోసం ఈరోజును త్యాగం చేస్తూనే ఉంది.

ఒక జీతం.. వంద బాధ్యతలు! : మధ్యతరగతి కుటుంబం కోరుకునేది విలాసవంతమైన జీవితం కాదు. అవసరాలు తీరాలి.. పిల్లలు బాగా చదవాలి.. సొంత ఇల్లు ఉండాలి.. అనారోగ్యం వస్తే వైద్యం చేయించు కోగలగాలి.. వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడకూడదు. ఇంతే.. కానీ ఈ చిన్న చిన్న కలలకే పెద్ద పెద్ద ఖర్చులు ఎదురవుతున్నాయి.

చివరగా.. మధ్యతరగతి కుటుంబం పేదరికం గురించి మాట్లాడలేక.. ధనికుల సౌకర్యాలను అందుకోలేక.. మధ్యలోనే నిశ్శబ్దంగా పోరాడుతోంది. సంపాదన కోసం పరుగులు.. ఖర్చుల కోసం పోరాటం.. భవిష్యత్తు కోసం పొదుపు.. బాధ్యతల కోసం త్యాగం.. ఇదే నేటి మధ్యతరగతి కుటుంబం కథ.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News