Homeఆదాబ్ ప్రత్యేకంMVSR Engineering College | మెరిటకు మంగళం.. డబ్బున్నోళ్లకే సీట్లు..

MVSR Engineering College | మెరిటకు మంగళం.. డబ్బున్నోళ్లకే సీట్లు..

ఎంవీఎసఆర్ కాలేజీ అరాచకం.. పట్టించుకోని ఉన్నత విద్యా మండలి

  • బీ-కేటగిరీ సీట్లకు అదనంగా రూ.7 లక్షల డొనేషన్ డిమాండ్..
  • అర్హత, మెరిట్ ఉన్నా అభ్యర్థిత్వాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరణ..
  • సీఎసఈ-ఏఐఎంఎల్ సీటు కోసం అదనపు నగదు డిమాండ్..
  • సెప్టెంబర్ 23న టీజీసీహెచఈ చైర్మన్‌కు గౌతమ్ ఫిర్యాదు..
  • కాలేజీపై పలు విద్యార్థి సంఘాల నుంచి కూడా ఫిర్యాదులు..

రాష్ట్రంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలలో ఒకటిగా చెప్పుకునే ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కళాశాల(MVSR Engineering College) యాజమాన్యం అక్రమ దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, చదువుకోవాలనే తపన ఉన్న ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థుల మెరిట్‌ను కాలరాస్తూ, బీ-కేటగిరీ సీట్లను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే కుట్రలకు తెరలేపింది. నిబం ధనల ప్రకారం మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాల్సింది పోయి, డబ్బున్న వారికి కోట్లకు కోట్లు అమ్ముకుంటూ… డబ్బు లేని ప్రతిభావంతులను నిలువునా మోసం చేస్తున్న ఈ కాలేజీ అరాచకాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి.

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన జె. గౌతమ్ అనే విద్యార్థి ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కళాశాల(MVSR Engineering College) లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీ రింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ – సీఎసఈ ఏఐఎంఎల్) బ్రాంచ్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విద్యార్థికి ఎంసెట్ (ఈఏపీసెట్) లో 47,723 ర్యాంకు రాగా, ఇంటర్మీడియట్‌లో 850 / 1000 (85%) మార్కులు సాధించి అద్భుతమైన మెరిట్ కలిగి ఉన్నాడు. కళాశాల యాజమాన్యం జూలై 4, 2026 నాడు అప్లికేషన్ నెం. 189 కింద గౌతమ్ వద్ద రూ. 3,000/- దరఖాస్తు రుసుమును కూడా అధికారికంగా స్వీకరించింది. కానీ, నిబంధనల ప్రకారం మెరిట్ ఉన్న ఈ విద్యార్థికి సీటు కేటాయించకుండా, కళాశాల యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరించింది.

బీ-కేటగిరీ సీటు కేటాయించడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన కన్వీనర్ ఫీజుతో సంబంధం లేకుండా, దానికంటే అదనంగా రూ. 7,00,000/- (ఏడు లక్షల రూపాయలు) నగదు డొనేషన్ (విరాళం) ఇస్తేనే సీటు ఇస్తామంటూ బరితెగించి డిమాండ్ చేసింది. ప్రతిభను నమ్ముకుని వచ్చిన ఒక విద్యార్థి భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, కాలేజీ యాజమాన్యం సాగించిన ఈ దోపిడీ పర్వంపై సెప్టెంబర్ 23, 2026 నాడు విద్యార్థి జె. గౌతమ్ నేరుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచఈ) చైర్మన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

చైర్మన్, సెక్రటరీల తీరుపై తీవ్ర విమర్శలు! : ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఈ అక్రమాలు, దందాలపై కేవలంఈ విద్యార్థి మాత్రమే కాకుండా.. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ మరియు ఎనఎస్ యూఐ వంటి పలు విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాయి.

దీనిని తీవ్రంగా పరిగ ణించినట్లు చెబుతున్న టీజీసీహెచఈ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్ట రెడ్డి మరియు కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌లు కేవలం నామమాత్రపు లేఖలు,నోటీసులు జారీచేసి చేతులు దులు పుకుంటున్నారే తప్ప, కళాశాల యాజ మాన్యంపై కనీస చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆగస్టు 28, 2026 నాటి తొలి లేఖ: ఎనఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఇతరులు చేసిన ఆరోపణలపై సెప్టెంబర్ 04 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సెప్టెంబర్ 15, 2026 నాటి తుది హెచ్చరిక లేఖ: కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు కౌన్సిల్‌కు ఎలాంటి వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినప్పటికీ, గడువు ముగిసినా అధికారులు ఇప్పటివరకు ఆ కాలేజీపై ఎలాంటి కఠిన చర్యలకు ఉపక్రమించలేదు. అధికారులు ఇచ్చిన నోటీసులకు విలువులేకపోతే, కాలేజీలు వాటిని బేఖాతరు చేస్తూ బరితెగిస్తుంటే… తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి గానీ, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గానీ ఆ పదవుల్లో ఉండి ప్రయోజనం ఏమిటని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు నిలదీస్తున్నారు. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నట్లుగా అధికారుల తీరు ఉందని మండిపడుతున్నారు.

ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలు.. తక్షణ చర్యలకు డిమాండ్ : మెరిట్ విద్యార్థులను అన్యాయంగా పక్కనబెట్టి, అదనంగా లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తూ సీట్లు అమ్ముకుంటామనే ఈ నికృష్ట సంస్కృతిని విద్యావేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు సెక్రటరీలు జోక్యం చేసుకుని, కేవలం నోటీసులతో కాలక్షేపం చేయకుండా… ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని, యాజ మాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

లేనిపక్షంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు! ఈ కళాశాల యాజమాన్యం మేనేజ్‌మెంట్ కోటాలో సాగిస్తున్న అక్రమ దందాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల ఎగవేతలపై మరిన్ని పూర్తి ఆధారాలను ‘ఆదాబ్ హైదరాబాద’ త్వరలోనే వెలుగులోకి తేనుంది.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

మా అక్షరం అవినీతిపై అస్త్రం!✊

- Advertisement -
RELATED ARTICLES

Latest News