విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.
“రణబాలి”తో తొలిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, “ది మమ్మీ” మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ. ఈ చిత్రంలో ఆయన సర్ థియోడోర్ హెక్టర్ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆర్నాల్డ్ వోస్లూ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “రణబాలి” మేకర్స్. బర్త్ డే పోస్టర్ లో ‘కరువు నేల రాక్షసుడు సర్ థియోడోర్ హెక్టర్’ అంటూ ఆయన పాత్రను పరిచయం చేశారు.



ఇటీవలే “రణబాలి” సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో
