- 11 రోజులు విశేష అలంకరణలు.. ముగింపు వేళ ‘ఫలసిద్ధి వినాయకుడి’గా దివ్య దర్శనం!
- నిరంతర నిత్య అన్నదానం.. అద్భుత ఏర్పాట్లతో ఈవో లావణ్య భక్తుల జేజేలు!
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో 11 రోజుల పాటు సాగిన వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ 11 రోజుల్లో ఆలయానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతో గణేష్ గడ్డ పరిసరాలు జనసముద్రంగా మారాయి.
11 రోజులు విశేష అలంకారాలు: స్వామివారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, పుష్పాలంకరణలు నిర్వహించారు. 11వ రోజున యాపిల్, అనాస, ద్రాక్ష, దానిమ్మ వంటి రంగురంగుల తాజా పండ్లతో మూలవిరాట్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, స్వామివారు ‘ఫలసిద్ధి వినాయకుడి’గా భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. మరోవైపు లడ్డూ వేలంపాటపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వేలాది భక్తులకు నిత్య అన్నదానం: ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు కడుపునిండా నిరంతర నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత సంతృప్తికరంగా నిర్వహించారు.Rudraram
ఈవో లావణ్య తిరుగులేని పర్యవేక్షణ: లక్షల మంది భక్తులు తరలివచ్చినా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా కార్యనిర్వహణాధికారిణి (ఈవో) లావణ్య గారు క్షేత్రస్థాయిలో ఉంటూ స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు, తాగునీరు, ప్రత్యేక క్యూలైన్లు, నిరంతర నిత్య అన్నదాన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి భక్తుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ఆమెకు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఈవో లావణ్య తో పాటు జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆలయ అర్చకులు, సిబ్బంది, ప్రముఖులు పట్లోళ్ల లక్ష్మారెడ్డి, కె. సాయి గణేష్, ఎస్. సతీష్ కుమార్, ఎ. మురళి గౌడ్, ఎ. సంతోష్, ఎ. ప్రభు, టి. శివ రాములు, ఎ. రాజేష్ గౌడ్, ఎ. ముకుంద రెడ్డి, సి. నారాయణ రెడ్డి, డి. మహేష్, ఎ. కృష్ణ, ఆర్. శ్రీనివాస్, ఎం. భరత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
