HomeతెలంగాణRotten Fish Hyderabad | కుళ్ళిన చేపలు అమ్ముతున్న వ్యాపారస్తులు..

Rotten Fish Hyderabad | కుళ్ళిన చేపలు అమ్ముతున్న వ్యాపారస్తులు..

  • హైదరాబాద్ లో పలు మార్కెట్లలో నిబంధనల ఉల్లంఘన..Rotten Fish Hyderabad
  • కొరడా ఝుళిపించిన టీజీ సేఫ్ అధికారులు..

హైదరాబాద్ నగరంలోని పలు చేపల మార్కెట్లలో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ-సేఫ్) విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వెటర్నరీ అధికారులతో కలిసి ఈరోజు బేగంబజార్, రాంనగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లోని మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని, తీవ్రంగా పాడైపోయిన చేపలను పెద్ద ఎత్తున గుర్తించి అక్కడికక్కడే పారబోశారు.Rotten Fish Hyderabad

తనిఖీల్లో భాగంగా బేగంబజార్‌లోని జీఎన్‌బీ శ్రీ శ్రీనివాస ఫిష్ మర్చంట్‌ దుకాణంలో సుమారు 70 కిలోల కుళ్లిన బొచ్చె (కట్ల) చేపలను అధికారులు తొలగించారు. అలాగే రాంనగర్‌లోని బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోలు, ముషీరాబాద్‌లోని జీబీకే ఫిషరీస్‌లో 30 కిలోలు, ఎస్వీఆర్ షాపులో 35 కిలోల తిలాపియా చేపలతో పాటు ఇతర దుకాణాల్లో అపరిశుభ్రంగా నిల్వ ఉంచిన చేపలను గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన రాంనగర్‌లోని రెండు వ్యాపార సంస్థలకు అధికారులు క్లోజర్ నోటీసులు జారీ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News