- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర..Nasha Mukt Campaign
- చివరిరోజు పాల్గొన్న హీరో అక్కినేని నాగార్జున..
మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్రకు సినీ ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో మూడు రోజులుగా జరుగుతున్న ఈ యాత్ర చివరి రోజైన శుక్రవారం, ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అంబర్‌పేట్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర ముగింపు రోజున అమీర్‌పేట వద్ద నాగార్జున జత కలిశారు. ఆయనతో పాటు నటుడు సాయికుమార్, దర్శకుడు బోయపాటి శ్రీను, హాస్యనటుడు శివారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.Nasha Mukt Campaign
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ యాత్ర జరగడం అభినందనీయమన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. “వ్యక్తిగతంగా నేను డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, నా కుటుంబాన్ని, స్నేహితులను, చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాను” అని నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. నటుడు సాయికుమార్ ‘నషా ముక్త్ భారత్ – మేం చేసి తీరుతాం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
