సౌతాఫ్రికా(South Africa)తో రెండు టెస్ట్‌ల సిరీస్(Test Series)లో టీమిండియా (Team India) వైట్‌వాష్ (White Wash)కి అందరూ బాధ్యులేనని మాజీ కోచ్ (Former Coach) రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కోచ్ గౌతమ్ గంభీర్ (Goutham Gambhir) సహా ఆటగాళ్లు (Players) ప్రతిఒక్కరూ ఆత్మవిమర్శ (Self-Criticism) చేసుకోవాలని సూచించారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇలాంటి పరాజయం మూటగట్టుకోవటంపై సీరియస్‌గా సమీక్షించుకోవాలని తెలిపారు.
‘టీమిండియా ప్రపంచ స్థాయి జట్టు అనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ప్లేయర్స్‌లో ట్యాలెంట్ ఉంది. స్పిన్ బౌలింగ్ ఆడటం రాక కాదు. బాల్యం నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ.. ఇలా ఒక్కసారిగా కుప్పకూలటం సరికాదు. అత్యల్ప స్కోర్లతో పెవిలియన్ చేరటం కరెక్ట్ కాదు. వికెట్లు పడకుండా ఆపాలనే కసి ఎవరిలోనూ కనిపించలేదు. ఇలా అయితే కష్టం. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా జరిగితే ముందుగా నాకు నేనే బాధ్యత వహించేవాణ్ని’ అని రవిశాస్త్ర పేర్కొన్నారు.

