Homeమహబూబ్‌నగర్‌Compensation | ముంపు నష్టపరిహారం 25 లక్షలు ఇప్పిస్తే..

Compensation | ముంపు నష్టపరిహారం 25 లక్షలు ఇప్పిస్తే..

  • ఎన్నికల నుండి తప్పుకుంటాం.
  • కాంగ్రెస్ పార్టీనీ నమ్మితే నట్టేట మునిగినట్టే.
  • చేసిన అభివృద్ధిని కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులది.
  • మాజీమంత్రి నిరంజన్ రెడ్డి..

గణప సముద్రం ముంపు రైతులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లిస్తే ఎన్నికల నుండి తప్పుకుంటామని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఆదివారం ఘనపురం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ అజంతా తరపున ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.12 ఏండ్ల క్రింద ఘణపురం ఎట్లుండే నేడు ఎట్లా ఉందో ప్రజలు భేరిజూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Niranjan Reddy Flood Compensation Challenge

ఘణప సముద్రం ముంపు రైతులకు కాంగ్రెస్ నాయకులు ఎకరాకు 25 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ దొంగలు ఎక్కడ ఉన్నారని, ఎకరాకు 11 లక్షల 75 వేలు ఇప్పిస్తానని అన్నమాటకు కట్టుబడి ఉన్నానని, ఇప్పటికైనా 25 లక్షల నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు మాట ఇస్తే క్యామ అజంతా ఎన్నికల బరినుండి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. చేసిన అభివృద్ధి కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులది అని దుయ్యబట్టారు.

- Advertisement -
Niranjan Reddy Flood Compensation Challenge 0

పేద ప్రజల కోసం 315 ప్లాట్లు లేఔట్ వేసి సిద్ధంగా ఉంచితే పంపిణీ చేయలేని వారికి పాలించే హక్కు ఎక్కడిదని అన్నారు. ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను ఆసరా పింఛన్లు 4 వేలు, మహిళకు 2500, కళ్యాణ లక్ష్మీ ద్వారా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, కెసిఆర్ కిట్టు, కంటి వెలుగు పథకాలు ఏవని నిలదీయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండేండ్లలో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అభివృద్ధి కొనసాగించాలంటే క్యామా అజంతా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News