HomeసినిమాKaasu | ఏఎం రత్నం లాంఛ్ చేసిన "కాసు" మూవీ గ్లింప్స్  

Kaasu | ఏఎం రత్నం లాంఛ్ చేసిన “కాసు” మూవీ గ్లింప్స్  

యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త సినిమా “కాసు”.(Kaasu) ఈ చిత్రంలో ఇందుకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఆర్. డ్రీమ్ పిక్చర్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. పి.ఎస్. హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో “కాసు” సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ అఖిల్ మాట్లాడుతూ – ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దురాశ, నీతి వంటి అంశాలతో కథ సాగుతుంది. ఈ చిత్రానికి వర్క్ చేసే క్రమంలో ప్రొడ్యూసర్స్ నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అన్నారు.

- Advertisement -

ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – ఇది నాకు ఎడిటర్ గా ఫస్ట్ మూవీ. ఈ కథ మొత్తం చదివాను. చాలా మంచి స్టోరీతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ – తెలుగు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే చిత్రమిది. ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత నా ద్వారా చేశాను. నందుతో నేను వర్క్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ నరేంద్ర కొండ మాట్లాడుతూ – ఈ చిత్రంలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం. ప్రేమలో ఉన్న ఒక జంట మధ్య డబ్బు విషయంలో దురాశ అనేది మొదలైతే ఆ రిలేషన్ కు, వారి ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు మా డైరెక్టర్ హర్షవర్థన్. ఆశ, దురాశ, ప్రేమ, డబ్బు పట్ల వ్యామోహం..ఇలాంటి హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కలిస్తే చివరకు కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఈ కాసు(Kaasu) చిత్ర నేపథ్యం. కథలోని అంశాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా మూవీలో ఉంటాయి. నందు, ఇందుకుమార్ చాలా బాగా నటించారు. ప్రశాంత్ మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. అన్నారు.

డైరెక్టర్ పి.ఎస్.హర్షవర్థన్ మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన ఎఎం రత్నం గారికి థ్యాంక్స్. ఆయనకు నేను పెద్ద అభిమానిని. మా ప్రొడ్యూసర్స్ నరేంద్ర గారు, ఇందు గారి సపోర్ట్ తో ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా కార్డ్ లో పిక్చర్Xపైత్యం అని వేసుకున్నాను. కథ రాస్తున్నప్పుడే అలా అనిపించింది. హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది.

ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేడ్స్ ఇస్తాం. ఒక్కో క్యారెక్టర్ కు ఒక్కో గ్లింప్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. కాసు(Kaasu) మూవీ వరల్డ్ లోకి మీరంతా వస్తారని నమ్ముతున్నాం. ఈ కథ రాశాక నేను కలిసిన ఒకే ఒక్క హీరో నందు. ఆయన కథ మూడు గంటలు విని చాలా బాగుందని చెప్పారు. నా ఫస్ట్ మూవీ హీరో కాబట్టి నందును మర్చిపోలేను. నాకు సపోర్ట్ గా నిలబడి ప్యాషనేట్ గా వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మాట్లాడుతూ – ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. సినిమా మేకింగ్ లో మీరు సంతృప్తి చెందేవరకు రాజీ పడొద్దు. నేను నా మొదటి సినిమా కర్తవ్యం నిర్మిస్తున్నప్పుడు ఆ మూవీ క్లైమాక్స్ షూట్ చేశాక నాకు సంతృప్తి కలగలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ నేరస్తులను అరెస్ట్ చేసింది అంతేనా, ఇంకా ఏదో చెప్పాలి సొసైటికి అని మళ్లీ  రైటర్స్ ను పట్టుకుని క్లైమాక్స్ చేయించి, షూట్ చేశాం.

ఆ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద విజయం సాధించింది. నా కెరీర్ లో చిన్న చిత్రంగా మొదలుపెట్టింది 7జి బృందావన్ కాలనీ. ఆ సినిమా గురించి నాకు ఇప్పటికీ ఫోన్స్ వస్తుంటాయి. అదొక కల్ట్, ఎపిక్ మూవీ. ఆ సినిమా సీక్వెల్ ఇప్పుడు చేస్తున్నాం. నేను పెద్ద పెద్ద చిత్రాలు నిర్మించాను. ఏ సినిమా చేసినా మొదటి చిత్రంలా భావించి నిర్మిస్తా. మీరూ అలాగే చేయాలని సలహా ఇస్తున్నా. సినిమా బాగా వచ్చింది అనుకోకుండా బాగా వచ్చేదాకా చేయండి. అన్నారు.

హీరోయిన్, ప్రొడ్యూసర్ ఇందుకుమార్ మాట్లాడుతూ – మా కాసు మూవీ ఎలా ఉంటుంది, మీ కాసులకు ఎంత న్యాయం చేస్తుంది అనేది ముందు ముందు తెలుసుకుంటారు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయిని నేను. సొసైటీ గురించి ఏమీ తెలియదు. యాంకరింగ్ తో మొదలుపెట్టి ఈ రోజు నిర్మాతగా, హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నా. నేను ఏది చేసినా సంతోషించేది మా నాన్నగారు. ఆయన పేరు మీదే మా మూవీ బ్యానర్ పెట్టుకున్నాను.

యాంకరింగ్ కాదు ఇంకా ఏదో చేయాలనే తపనలో ఉన్నప్పుడు హర్షవర్థన్ ఒక స్టోరీ చెప్పాడు. ఈ కథ ఎంత బాగా నచ్చిందంటే వెంటనే ఏమీ ఆలోచించకుండా బ్యానర్ లాంఛ్ చేశాము. మా ప్రొడ్యూసర్ నరేంద్ర కొండ గారు నాకు ఆ వెంకటేశ్వరస్వామి అని భావిస్తా. నందు బలమైన స్టోరీస్ ఎంచుకుంటాడని అంటారు. కానీ కాసు స్టోరీనే ఆయనను ఎంచుకుంది. ఈ కథలో మరో హీరో ఉంది. అదే మాన్ స్టర్. దాన్ని బాగా చూపించేందుకు ప్రయత్నించాడు మా వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ అఖిల్. మా కాసు నుంచి ఏ అప్డేట్ వచ్చినా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరో శ్రీ నందు మాట్లాడుతూ – నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రంలో జై అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ హర్షవర్థన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. కాసు లాంటి ప్రపంచంలో నన్ను జై గా చూసినందుకు హ్యాపీగా ఉంది. దండోర, సైక్ సిద్ధార్థ్ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. నా కెరీర్ లో చేస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇది. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాను టెక్నికల్ గా బ్రిలియంట్ గా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా క్వాలిటీ మీద ఖర్చు చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. డబ్బు సంపాదించడం చేతగాని వాళ్లే డబ్బుతో సంతోషాన్ని కొనలేం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంటారు.

డబ్బు మనకు కావాలి. మన వాళ్ల అవసరాలకు కావాలి. అంతే గానీ మనం జబ్బు పడేంతగా డబ్బు కోసం ఆరాటపడొద్దు. మన వాళ్లకు ఏదైనా వస్తే చూసుకునేంత ఉండాలి. డబ్బు జబ్బు కింద మారితే ఏమవుతుంది అనేదే ఈ కాసు సినిమా. ఈ సినిమా ఎంటర్ టైన్ చేస్తూనే సైకలాజికల్ గా మనకొక మంచి మెసేజ్ ఇస్తుంది. ఈ కథ విన్నాక ఈ స్టోరీలోని దురాశ అనే పాయింట్ నన్ను రెండు రోజులు వెంటాడింది. కథ విన్నాక నా దృక్పథంలోనూ మార్పులు వచ్చాయి. ఇదే ఎక్సిపీరియన్స్ ఆడియెన్స్ కు కూడా వస్తుందని అనుకుంటున్నా. వివిధ భాషల్లోని టాప్ యాక్టర్స్ మా మూవీలో ఉన్నారు. మా మూవీ మీ అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

నటీనటులు – శ్రీ నందు, ఇందు కుమార్, తదితరులు

టెక్నీషియన్స్
———————
ప్రొడక్షన్ డిజైన్ – నరహరి వర్మ
కాస్ట్యూమ్ డిజైనర్ – రోజా భాస్కర్
యాక్షన్ మాస్టర్ – రాజేశ్ లంకా
కొరియోగ్రాఫర్ – జె.డి.
ఎడిటర్ – శ్రీనివాస్ బాయినబోయిన
డీవోపీ – శ్యామ్ కె నాయుడు
మ్యూజిక్ – ప్రశాంత్ ఆర్ విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రూపేష్ మామిళ్లపల్లి
ప్రొడ్యూసర్స్ – ఇందు కుమార్, నరేంద్ర కొండ
స్క్రిప్ట్, డైరెక్షన్ – పి.ఎస్.హర్షవర్థన్
డిజిటల్ మార్కెటింగ్ – వారే మీడియా
పీఆర్ఓ- సురేష్ (ఎస్ కే మీడియా)

- Advertisement -
RELATED ARTICLES

Latest News