- వాషింగ్టన్‌లో ఘనంగా నిర్వహణ..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అంతర్జాతీయ శాంతి దూత డాక్టర్ కే.ఏ. పాల్ 63వ జన్మదిన వేడుకలు(Birthday Celebrations) అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో అత్యంత వైభవంగా జరిగాయి. వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక ‘క్యాపిటల్ హిల్టన’ వేదికగా ‘గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట’ సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తో పాటు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు దేశాల అంతర్జాతీయ రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా గ్లోబల్ లీడర్లతో సాన్నిహిత్యం.. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇతర దేశాల నాయకులను కలవడానికి కొందరు ప్రైవేట్ వ్యక్తులు లేదా బ్రోకర్లను ఆశ్రయిస్తున్న కాలమిది. అలాంటిది, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశ నాయకులతో నేరుగా వ్యక్తిగత పరిచయాలు కలిగి ఉండటం, ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా వారిని నేరుగా కలిసేంత సాన్నిహిత్యం డాక్టర్ కే.ఏ. పాల్‌కి ఉండటం ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ప్రపంచ శాంతిని కాపాడేందుకు, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధాలు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నాయకులు ఐక్యంగా కృషి చేయాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
