Homeవరంగల్‌Lambada | గుర్తించిన వారే తొలగించాలని చూడడం విడ్డూరం…

Lambada | గుర్తించిన వారే తొలగించాలని చూడడం విడ్డూరం…

  • లంబాడాల ఎస్టీ గుర్తింపుకు రేవంత్ ప్రభుత్వం రిక్త ‘హస్తం’…
  • మల్యాతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి బోడ బీక్యా నాయక్ ఆరోపణ…!
  • స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపు…!

లంబాడ కులస్తులను సంచార జాతిగా గుర్తించిన నాటి ఇందిరా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వము, 1975 సంవత్సరంలో ఎస్టీ జాబితాలో చేర్చగా నేడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు లంబాడా కులస్తులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము వారికి సపోర్ట్ చేస్తున్నారని గుర్తించిన లంబాడా కులస్తులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పర్వతగిరి మండలంలోని మల్యాతండా గ్రామపంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా

Lambada ST Status Issue and Local Election Appeal

పోటీ చేస్తున్న బోడ బీక్యా నాయక్ స్థానిక లంబాడా సోదరీ సోదరులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భీక్యా నాయక్ మాట్లాడుతూ లంబాడా, కోయాల మధ్య వైరం సృష్టిస్తూ, ఎస్టీ జాబితా నుండి లంబాడా కులస్తులను తొలగించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు.

- Advertisement -
Lambada ST Status Issue and Local Election Appeal 2

మల్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచరాయి తండా, లాలు తండా, గడ్డపార తండా, అర్జా తండా తదితర తండాలు ఉన్నందున ఆ తండాలలో ఉన్న సమస్యలను గుర్తించి, స్థానిక వార్డు సభ్యులతో గ్రామసభ తీర్మానం ప్రకారం ప్రజలకు ఆమోగ్యయోగ్యమైన పరిపాలన అందిస్తానని, ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోడ బీక్యా నాయక్ స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Lambada ST Status Issue and Local Election Appeal 3

అలాగే వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బానోత్ కొండాలి బొజ్యా నాయక్, భానోత్ వెంకన్న నాయక్, భూక్య బద్రు నాయక్, గుగులోత్ సుమన్ నాయక్, బానోత్ కమిలి హథిరాం నాయక్, బానోత్ కవిత బిక్షపతి నాయక్, భానోత్ ఆలా నాయక్, పాల్తయా కమిలి హత్తిరామ్ నాయక్ లకు కేటాయించిన గుర్తులపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News