Homeఆదిలాబాద్Arrive Alive | విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై సమాజంలో చైతన్యం కలిగించాలి

Arrive Alive | విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై సమాజంలో చైతన్యం కలిగించాలి

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
  • అరైవ్ అలైవ్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మానవహారం.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అరైవ్ అలైవ్ వారోత్సవాలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ అరైవ్ అలైవ్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలో జయశంకర్ చౌరస్తా సమీపంలో విద్యార్థులచే భారీ మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలు తమ పాటల ద్వారా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి పిల్లలందరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాఠశాలలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని అన్నారు.

- Advertisement -

విద్యార్థులే రోడ్డు భద్రత నియమాలపై ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ లు అని, పిల్లలు మంచి విషయాలు చెబితే ప్రతి ఒక్కరు తప్పకుండా వింటారని అన్నారు. విద్యార్థులు తమ ఇండ్లలో తల్లిదండ్రులకు, సమాజంలోని వ్యక్తులకు ట్రాఫిక్ నియమాల గురించి చైతన్యం కలిగించాలన్నారు. తమ కుటుంబ సభ్యులు వాహనాలలో బయటకు వెళ్ళునప్పుడు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం వంటి రోడ్డు భద్రత విషయాలపై వివరించాలని తెలిపారు. విద్యార్థులు ఎవరు తగిన వయస్సు లేనిదే వాహనాలను నడుపరాదని సూచించారు.

Students Lead Traffic Awareness Drive in Arrive Alive Week6

పలువురు విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించేలా ఉపన్యాసాలు ఇచ్చారు. కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ మానవహారం లో సీపీఓ జీవరత్నం, డీఈవో భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఎంవిఐ మహేందర్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎన్ సి సి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News