Homeనల్లగొండIndira Gandhi Birth Anniversary Celebrations | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.

Indira Gandhi Birth Anniversary Celebrations | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.

  • ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.Indira Gandhi Birth Anniversary Celebrations

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను (Indira Gandhi Birth Anniversary Celebrations) వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా పార్కులోని ఆమె విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. దేశ సమైక్యత, అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
అనంతరం ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించి, చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, రమాదేవి, మహేశ్వరి, పీతంబర్, పరశురాం, క్రాంతి కుమార్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోపాల్ పేట లో ..Indira Gandhi Birth Anniversary Celebrations

- Advertisement -

గోపాలపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ .. దేశ సమగ్రత, ఐక్యత, పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ ఆర్థిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె అనుసరించిన విధానాలు, చూపిన నాయకత్వ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంద సత్య శీలా రెడ్డి, కొంకి వెంకటేష్, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube) 

- Advertisement -
RELATED ARTICLES

Latest News