Homeమహబూబ్‌నగర్‌Awareness | మధుమేహం వల్ల కంటి చూపు సమస్యలు

Awareness | మధుమేహం వల్ల కంటి చూపు సమస్యలు

  • ప్రజలలో అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి: మధుమేహం కారణంగా సంభవించే కంటిచూపు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి “దృష్టి” కార్యక్రమంతో సమగ్ర స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య సేవలను బలోపితం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ ఈ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం, ఇందిరా కాలనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న మధుమేహ “దృష్టి” ఉచిత శిబిరాలను సందర్శించి రెటినోపతి స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మధుమేహ రోగులకు రెటినోపతి స్క్రీనింగ్ కార్యకలాపాల పురోగతిని సమీక్షించి, కంటిచూపు రక్షణలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. మిషన్ మధుమేహ దృష్టి స్క్రీనింగ్‌ను వేగవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడికి పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో మధుమేహం ఉన్న రోగులందరినీ స్క్రీనింగ్ నిర్వహిస్తు న్న శిబిరానికి తీసుకువచ్చే బాధ్యత ఆశ వర్కర్ల పై ఉందని అన్నారు.

- Advertisement -
drushti diabetes eye awareness telangana adarsh surabhi

భవన నిర్మాణ పనుల పరిశీలన

జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తు న్న సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహ నూతన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన వసతిగృహ భవనాన్ని జనవరి 26వ లోపు ప్రారంభానికి సిద్ధమయ్యేలా పూర్తి చేసి అప్పగించాలని గుత్తేదారుకు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తది తరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News