- ఆ భూములు రైతులకే దక్కాలి..
- అధికార, ప్రతిపక్ష ముఖ్య నాయకులు వక్ఫ్ భూములు కొట్టేస్తున్నారు..
- నమస్తే తెలంగాణ, సాక్షిలో ఒక్క రోజు వార్తలు రాసి
- బీఆర్ఎస్ ముఖ్యనేత ఒత్తిడితో కబ్జా బాగోతాన్ని పక్కన పెట్టారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్గనైజ్డ్ గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూములు కబ్జా పెడుతోందని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీవ్ర విమర్శలు చేశారు.. రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు – ఏ గ్రామ భూ బాధితులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ క్రమంలో మాట్లాడుతూ కొంగరకుర్దులో ఉన్న 580 ఎకరాల వక్ఫ్ భూమిలో ఇప్పటికే 150 ఎకరాలు భూ మాఫియా చెరలోకి వెళ్లిపోయిందన్నారు.. కొంగరకుర్దులోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని 2007లోనే గెజిట్ ఇచ్చి 22ఏ లో చేర్చారు..
2022లో ఈ భూములపై మాఫియా కన్ను పడింది.. ఒక రైతు 58 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే మూడు జేసీబీలతో ఆ పంటను ధ్వంసం చేసి లే అవుట్ చేశారు.. బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎంతటి దౌర్జన్య పరమైన రాజ్యం సాగుతుందో కొంగరకుర్దులో అంతే దౌర్జన్యం గా రైతులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కున్నారు.. భూ మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు.. కొంగరకుర్దు గ్రామంతో సంబంధం లేని వారి పేర్లతో ఓ ఆర్ సీ లు సృష్టించి వాటితో కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా జడ్జిమెంట్ లు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ లు చేయించుకుంటున్నారు..
2022 లో 22ఏ లో ఉన్న కొంగరకుర్దు భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి.. దానికి సంబంధించిన అన్ని రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ అనే సంస్థలు ఇక్కడ భారీ వెంచర్లు వేశాయి.. 2022 తర్వాత ఇక్కడ జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో లే అవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు.. హెచ్ఎండీఏ కమిషనర్ ఏం చేస్తున్నారు.. ఈ రోజు కూడా కొంగరకుర్దు భూముల్లో నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డు లే స్పష్టం చేస్తున్నాయి..
ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు, వక్ఫ్ బోర్డుకు మధ్య కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుంది.. కోర్టు తీర్పు వస్తే అది వక్ఫ్ బోర్డుదా, రైతులదా అనేది తేలుతుంది. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ ఇకపై ఒక్క గజం భూమిలో వెంచర్ ఎక్స్ టెండ్ చేసినా రంగారెడ్డి కలెక్టర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరిస్తున్నాను.. కొంగరకుర్దు రైతులను రెండు నిర్మాణ సంస్థలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల భూమిని కొట్టేస్తున్నారు.. బందిపోటు దొంగలు కూడా ఇలా పగటి పూట దొంగతనం చేయరు..
నమస్తే తెలంగాణ లో ఒక్క రోజు ఈ భూ మాఫియాపై వార్త వచ్చింది.. అది ఒక ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడి వెంచర్ .. వెనుక మరో ముఖ్య నాయకుడు ఉన్నాడు.. తెల్లారి నుంచి ఆ పేపర్ ల ఒక్క ముక్క కూడా రాయలేదు.. సాక్షిలో మాఫియాకు వ్యతిరేకంగా ముందు రోజు ఆర్టికల్ వచ్చింది.. ఆ తెల్లారే రైతులకు వ్యతిరేకంగా స్టోరీ రాసిండ్రు..
నేను ఈ మధ్య తెలుసుకున్న రామన్న – జగనన్న దోస్తులు అయ్యిండ్రని.. అందుకే ముందు రోజు భూ మాఫియా కు వ్యతిరేకంగా వార్త వస్తే.. తెల్లారే దాన్ని రైతులకు వ్యతిరేకంగా మార్చిండ్రు .. అంటే దీని వెనుక ఏ శక్తులు ఉన్నయి? కొంగరకుర్దు భూముల విషయంలో తన సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేయొద్దని బాలమయా దేవి అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఒక్క రోజు నమస్తే తెలంగాణలో, సాక్షిలో ఆర్టికల్స్ రాసిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు.. బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని నేను సవాల్ విసురుతున్నాను..
నర్సమ్మ అనే రైతు భూమికి లక్ష్మీ అనే పేరుతో ఓ ఆర్ సీ తెచ్చుకున్నారు.. ఇలాంటి అక్రమాలు ఎన్నో కొంగరకుర్దులో జరిగాయి.. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి.. బీఆర్ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయని నేను చెప్పిన దానికి ఈ కొంగరకుర్దు భూములు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు..(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
