Homeరంగారెడ్డికొత్తపేట డ్రైనేజ్ పనులను ప్రారంభించిన నాయకోటి పవన్ కుమార్

కొత్తపేట డ్రైనేజ్ పనులను ప్రారంభించిన నాయకోటి పవన్ కుమార్

ఈరోజు కొత్తపేట డివిజన్ పరిధిలోని ప్రజయ్ నివాస్ ఫేజ్–1, ఫేజ్–2 మరియు మానస ఎన్‌క్లేవ్ కాలనీలలో డ్రైనేజ్ పనులను కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ పనులకు సుమారు 8 లక్షల రూపాయల వ్యయం కేటాయించబడింది. ప్రస్తుతం ఉన్న 200 మి.మీ. డయా పైప్‌లైన్‌ను 300 మి.మీ. డయా పైప్‌లైన్‌గా మార్చి, ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఎదురవుతున్న డ్రైనేజ్ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఈ పనులు ప్రారంభమయ్యాయి.

drainage works inaugurated kothapet division naikoti pavan kumar.jpg1

ఈ సందర్భంగా కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ!!

- Advertisement -

“చాలాకాలంగా ప్రజయ్ నివాస్ ఫేస్-1, ఫేస్ 2, మానస ఎన్‌క్లేవ్ ప్రజలు డ్రైనేజ్ సమస్యతో నిరంతరం ఇబ్బంది పడేవారు. పైప్లైన్ చిన్నది కావడంతో ఈ యొక్క సమస్య తరచూ వస్తూ ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ పనులు మొదలుపెట్టడం జరిగింది. పనులలో ఏలాంటి జాప్యం లేకుండా, లెవెల్స్ సరి చూసుకుంటూ,నాణ్యతతో కూడిన పనులు జరగాలని కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు ఏఈ స్రవంతి రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్, సూపర్వైజర్ దయాకర్ మరియు ప్రజయ్ నివాస్ ఫేస్ – 1, ఫేస్ – 2 అసోసియేషన్ సభ్యులు, కొత్తపేట డివిజన్ బిజెపి అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్, జిల్లా నాయకులు జంగా రెడ్డి, అశ్విన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News