Homeరంగారెడ్డిSIR | ప్రతి అర్హ ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి

SIR | ప్రతి అర్హ ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి

జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బజరంగ్ నగర్ కాలనీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి అర్హ ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అందరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్షులు కుతాడి శ్వేతా ముఖేష్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కే. సత్యనారాయణ, బజరంగ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు కే. నరసింహులు, కోళ్ల ఫారం–జ్యోతి కాలనీ ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. కేశవ రెడ్డి, బజరంగ్ నగర్ ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గవర సూర్యనారాయణ, జ్యోతి కాలనీ అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్, ఏడుకొండల శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

అనంతరం కాలనీలో ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వర్ణ శ్రీధర్ రెడ్డి, పోరెడ్డి వెంకటేశ్వర్లు, టి.సి.కె. నారాయణ, సుబ్బారావు, రామచంద్ర, రామ తులసి, విజయలక్ష్మి, సరోజినీ దేవి, బి. సరస్వతి నాయుడు, పోరెడ్డి కవితతో పాటు కాలనీ వాసులు తదితరులు.పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News