Homeరంగారెడ్డిRamzan | రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

Ramzan | రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ నైస్ గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, హజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజీబ్రుద్దీన్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.

Ramadan Gift Kits Distributed To Muslim Brethren In Hyderabad

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, సీనియర్ నాయకులు సదానంద్, శంకర్ గౌడ్, వేణు, సత్తిష్ గౌడ్, ఫారుక్, పాషా మియా, కాలేశా, యూసుఫ్ పటాన్, ఉమర్, రాష్ట్ర నాయకురాలు అనంతలక్ష్మి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చింత విజయ, గండి సునీత, రజిత గోపాల్, లత, సునీత, ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News