ప్రజల విమర్శలను వినడం, ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ, మీడియాకు ప్రశ్నించే హక్కు, పోలీసులు చట్ట పరిధిలో వ్యవహరించడం, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం- ఇవే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలమానాలు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఈ విలువలు క్రమంగా మసకబారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన పాలకులే అధికార దర్పంతో వాటిని హరించడం ఎంతకాలం? అధికారం గొంతులను అణచగలదేమో!, ఆలోచనలను కాదు.తిరుగులేదనుకున్న చోటే ప్రజాగళం పుడుతుంది.అదే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం.. అదే అంతిమ విజయం.
- మేదాజీ
- Advertisement -
