జిల్లాలో పత్తి కొనుగోళ్లు (Cotton Purchases) వచ్చే నెల (నవంబర్) 3 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు జిన్నింగ్ మిల్లుల్లో (Ginning Mills) వీటిని మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని జిల్లా మార్కెటింగ్ శాఖ (Marketing) అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. తాండూరు(Tandoor)లోని మహేశ్వరి కాట్స్, దండేపల్లిలోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్‌లో కొనుగోలుకు శ్రీకారం చుడతారు. రైతులు కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App)లో స్లాట్ (Slot) బుక్ చేసుకోవాలని, దాని ప్రకారం కొనుగోలు కేంద్రాలకు రావాలని కోరారు. రూల్స్ (Rules) ప్రకారం పత్తి కొనుగోలు చేస్తామని చెప్పారు. పత్తిలో తేమ 8 శాతం మించకుండా ఉండాలని సూచించారు.
