Saturday, June 27, 2026
Homeఆదిలాబాద్Chandrababu | తేడాగా వ్యవహరిస్తే తాట తీస్తా..

Chandrababu | తేడాగా వ్యవహరిస్తే తాట తీస్తా..

  • పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ..
  • మంగళగిరిలో క్లస్టర్ ఇంచార్జ్ లతో మీటింగ్..

తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రామాణికమని, తప్పులు చేసే వారిని, తేడాగా వ్యవహరించే వారిని వదిలించుకుంటానని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పార్టీ పదవుల నుంచి ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు వరకు నిరంతరం సర్వేలు చేయిస్తానని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “ఇకపై పార్టీకి ఓటమి లేదు, రాదు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలతో మంచిగా ఉంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్నాం. అన్నింటికీ మించి ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. అందుకే ఓటమి మన దరికి చేరదు. రాష్ట్రం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వారిని, తేడాగా ఉన్నవారిని వదిలించుకోవడానికి వెనుకాడను” అని స్పష్టం చేశారు.

- Advertisement -

గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచిస్తూ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపారు. “మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019లో లోకేష్ ఓడినా పట్టు వదలకుండా పనిచేసి, 2024లో అద్భుత విజయం సాధించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. అందరూ లోకేష్‌లా పనిచేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు. మంచి సంకల్పంతో పనిచేస్తే దానికి తగ్గ వాతావరణం దానంతట అదే ఏర్పడుతుందని, ‘ది సీక్రెట్’ పుస్తకాన్ని ప్రతి కార్యకర్తా చదవాలని సూచించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News