Homeరంగారెడ్డిMarket | సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం.

Market | సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం.

కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేసిన పాలకవర్గం సభ్యులు వివిధ రకాల పండ్ల రసాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి , సభ్యులు , వర్తకులు, రైతులు అభిషేకం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసిన పాలకవర్గం సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

CM Revanth Reddy Portrait Anointment3

ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోహెడ ప్రాంతంలో సర్వే నంబర్ 167 లో రాష్ట్ర ప్రభుత్వం 239 ఎకరాలు పండ్ల మార్కెట్ నిర్మాణానికి అధికారికంగా ప్రభుత్వం కేటాయించి ఆమోదం తెలపడం శుభపరిణామం అని రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రైతులు, వర్తకులు నష్టపోయారని, రైతు ప్రభుత్వంగా కాంగ్రేస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

- Advertisement -
CM Revanth Reddy Portrait Anointment

రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని వీలైనంత త్వరలో శంకుస్థాపన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాస్కర చారి, పాలకవర్గం సభ్యులు, అధికారులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News