Wednesday, December 10, 2025
EPAPER
Homeవరంగల్‌Narsampet | వారి మధ్య తెర తొలిగింది…

Narsampet | వారి మధ్య తెర తొలిగింది…

  • నర్సంపేటకు గ్రహణం వీడింది…
  • 1000 కోట్లతో నర్సంపేట కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి…
  • కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం

అవును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మధ్య తెర తొలగిపోయింది. గతంలో ఎన్నడు లేని విధంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మృతి చెందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడమే కాకుండా స్వయంగా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దశదినకర్మల్లో పాల్గొని దొంతి మాధవ్ రెడ్డికి అభయహస్తం అందించారు. దాంతో గత రెండేళ్ల నుండి వీరి ఇరువురి మధ్య ఏర్పడిన వైరం తొలగిపోయి ఉండడమే కాకుండా డిసెంబర్ 5వ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి 1000 కోట్ల నిధులతో నర్సంపేట కు విచ్చేసి వివిధ పనులకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి సఖ్యత లేదని నిధులు రావని మంత్రి పదవి సైతం రాదని ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేస్తూ మాట్లాడాయి. ఆ మాటలకు చెక్కు పెట్టిన నర్సంపేట ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో సఖ్యత ఉందని నిరూపించుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీన జరుగు పలు రకాల అభివృద్ధి పనులకు స్వయంగా ముఖ్యమంత్రిని రమ్మనడం ఆయన ఓకే అని చెప్పి రానుండడంతో తో వారి మధ్య వైరం తొలగిందని ఇక నర్సంపేటకు నిధుల వరద రానుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.

- Advertisement -

రెండేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న క్రమంలో ములుగు నుండి మహబూబాబాద్ కు వెళ్లే క్రమంలో నర్సంపేట మీదుగా పయనించాల్సిన రేవంత్ రెడ్డి నర్సంపేట భూభాగ పరిధిలో కాలు మోపకుండానే ములుగు నుంచి నేరుగా మహుబూబాద్ జిల్లాకు చేరుకొని తన పాదయాత్రను పున ప్రారంభించారు. దానికి తోడు మహబూబాబాద్ లో జరిగిన వేడుకలకు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ దొంతి మాధవరెడ్డి వెళ్లలేదని అదేవిధంగా ముఖ్యమంత్రి ఆన్ రోడ్ మీద వాహనాలలో వెళుతూ స్వయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుండి వాహనం వెళ్లినప్పటికీ నర్సంపేట ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఖాతరు చేయలేదని వారి మధ్య వైరం రోజురోజుకు పెరిగిపోతుందని యిన్నాళ్లు చర్చలు నర్సంపేటలో జరిగాయి.

అంతేకాకుండా మేడారం సమ్మక్క గద్దెకు వచ్చినప్పటికీ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మేడారం వెళ్లినప్పటికీ నర్సంపేట ఎమ్మెల్యే వెళ్లకుండా ముఖ్యమంత్రికి దూరమయ్యాడని పలువురు పలు రకాలుగా బాహాటంగా విమర్శించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మరణించడంతో వారి మధ్య వైరం విడిపోయింది. ముఖ్యమంత్రి ఇంటికి రావడంతో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆయనకు స్వాగతం పలికిన నాటి నుండి వారి మధ్య వైరం పోయి సయోధ్య కుదిరింది. దీంతో నర్సంపేట ప్రజలు కొంత ఇన్నాళ్లు అసహనానికి గురైనప్పటికీ సరైన సమయంలో సరైన సయోధ్య జరిగిందని ఇక ఇప్పటి నుండి నర్సంపేటకు నిధుల వరద ప్రభావం పెరుగుతుందని నర్సంపేట అగ్రగామిగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.

5న నర్సంపేట కు సీఎం రాక

డిసెంబర్ 5వ తేదీన నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల నిధులతో రానున్నట్లు నర్సంపేట పట్టణాన్ని ఆనుకొని ఉన్న మెడికల్ కాలేజ్ పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులతో పాటు కాంగ్రెస్ శ్రేణులను తీసుకొని వెళ్లి స్థల పరిశీలన చేసి 1000 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాడని స్పష్టం చేశాడు. అభివృద్ధి పనుల్లో భాగంగా నర్సంపేట నుండి వరంగల్ కు నాలుగు లైన్ల రోడ్డు పాకాల చెరువు పంట కాలువల మరమ్మతులు అంతర్గత గ్రామాల బీటి రోడ్లు, మెడికల్ కళాశాలకు అదనపు భవనాలు మొత్తం కలిపి 1000 కోట్లు నిధులు వెచ్చిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నాడు.

సీఎం డిసెంబర్ 5 వ తేదీన రానున్న నేపథ్యంలో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార సభ తో పాటు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకు వైరం విడిపోయిందని సమాచారం యావత్ వరంగల్ జిల్లా ప్రజలకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సభతో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు వైరం లేనట్లు రుజువు కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృత నిశ్చయంగా ఉన్నట్లు శ్రేణులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News