Homeనల్లగొండBike Stunts | మఠంపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదకర బైక్ స్టంట్లు

Bike Stunts | మఠంపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదకర బైక్ స్టంట్లు

  • ఓ బైక్ రేసర్ వీరంగం…
  • భయాందోళనలో స్థానికులు…

మఠంపల్లి మండల కేంద్రంలో ఓ బైక్ రేసర్ ప్రమాదకర స్టంట్లు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేశాడు.శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో జాన్ పహాడ్ క్రాస్ రోడ్ వద్ద అత్యంత వేగంతో బైక్ రేసింగ్ చేస్తూ ప్రమాదకర స్టంట్లకు పాల్పడుతూ మట్టపల్లికి వెళ్ళే దారిలో ప్రయాణించాడని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు.ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ సమయంలోనే ఈ స్టంట్లు కొనసాగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు ఈ చర్యలతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యామని తెలిపారు.

ఒక్క క్షణంలో బైక్ అదుపు తప్పినా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవంటూ స్థానికులు భయ బ్రాంతులకు గురి అయ్యారు.ఇలాంటి చర్యలతో రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే బైక్ రేసర్ తమ విన్యాసాలు ప్రదర్శించడం పట్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని అదే విధంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రధాన రహదారులపై పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

సీసీ టీవీ కెమెరాల ఆధారంగా బైక్ రేసర్ ను గుర్తించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు దారితీసే బైక్ రేసింగ్‌,వీలింగ్,ప్రమాదకర స్టంట్ల ఆగడాలను అరికట్టేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరారు.రోడ్లపై కేవలం సరదా కోసం చేసే ఇలాంటి ప్రమాదకర విన్యాసాలతో పెద్ద ప్రమాదాలు జరిగి జీవితం విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరించారు.ముఖ్యంగా తల్లి తండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలను ఇవ్వవద్దని అదే విధంగా వాహనాలు ఎలా నడుపుతున్నారో నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతగా మెలగాలని పోలీసులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News