బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి
అమరావతి: ఈ నెల (నవంబర్) 8న భక్త కనకదాస జయంతి(Bhakta Kanakadasa Jayanti)ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister S.Savitha) ఈ విషయాన్ని వెల్లడించారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా అనంతపురం జిల్లా (Ananthapuram District) కల్యాణదుర్గం(Kalyanadurgam)లో నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హాజరవుతారని పేర్కొన్నారు.

అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. సామాజిక తత్వవేత్త(Social Philosopher)గా, స్వరకర్త(Composer)గా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తెచ్చారని వివరించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అలాంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. గతేడాది కూడా అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తుచేశారు.

