- రాగిడి లక్ష్మారెడ్డి
బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మేడ్చల్ లోని శ్రీ గార్డెన్ లో ఆదివారం మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాగిడి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోసించిన ఉద్యమ కారులను పార్టీ ఎప్పటికి మరిచిపోదని, వారిని గుండెల్లో పెట్టుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమం లో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రవి నాయక్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్,సీనియర్ నాయకులు రాజా మల్లారెడ్డి, భాగ్య రెడ్డి, నవీన్ రెడ్డి, జగన్ రెడ్డి, రణదీప్ రెడ్డి, తుడుం గణేష్,మల్లికార్జున స్వామి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నడికొప్పు నగరాజ్, శ్రీకాంత్ రెడ్డి,, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మాజీ వైస్ ఎంపిపి వెంకటేష్, మేడ్చల్ జిల్లా బి ఆర్ టి యు అధ్యక్షులు సంబు ప్రభాకర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు తదితరులు పాల్గొన్నారు.
