- అహ్మదాబాద్ వేదికగా చారిత్రాత్మక సమరం..
- టైటిల్ కోసం ఆర్.సి.బీ., గుజరాత్ యుద్ధం..
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు జరగనున్న టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉన్నాయి. గతేడాది ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ దశాబ్దాల టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐదేళ్లలో ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన గుజరాత్, 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది.
- Advertisement -
